ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకో బజార్
On
విశ్వంభర, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గురువారం ఎకో బజార్ యాక్టివిటీలో భాగంగా, మట్టితో విగ్రహాలు, సీడ్ బాల్స్ ను విద్యార్థులతో తయారు చేయించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ యాక్టివిటీస్ ద్వారా పర్యావరణ సమతుల్యత ప్రాముఖ్య్యాన్ని, అడవుల పెంపకం గురించి విద్యార్థులకు వివరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నీలిమ, డాక్టర్ కిషన్, డాక్టర్ కృష్ణ కౌండిన్య, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సునీత, అనిత, డాక్టర్ రవీందర్రావు, డాక్టర్ రాచమల్ల శ్రీను, టి.శ్రీనివాసులు, అమర్, నరేష్, ఆంజనేయులు, రాధిక, రవి తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



