ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ వేయాలి 

ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ వేయాలి 

  •  తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి

విశ్వంభర, బషీర్ బాగ్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం చట్ట బద్దమైన కమిటీ వేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ  రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి అన్నారు. కమిటీకి 6 నెలల కాల పరిమితి ఉండాలనీ డిమాండ్ చేశారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ  ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 250 గజాల స్టులం, హెల్త్ కార్డు ఇవ్వాలన్నారు.తెలంగాణా రాష్ట్ర సాధనలో ఉద్యమ కారుల త్యాగం మరువలేనిదన్నారు. ఎన్నో కష్టలు, కేసులు, జైలు జీవితం అనుభవించన వారు నేడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుండాలనీ, తెలంగాణ అమర వీరుల కుటుంబలాను సైతం ఆదుకోవడానికి ముందుకు రావాలని ప్రభుత్వన్ని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జానకి రెడ్డి, ఓరుగంటి ఆనంద్, సుల్తాన్  యాదగిరి, సికింద్ర బేగం, అనిల్ కుమార్, సుజి, కొమురయ్య, మోహన్ బైరాగి, లారా, గోశిక రవి, యాదగిరి, హరి, సుచరిత తదితరులు పాల్గొన్నారు.

Tags: