గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

విశ్వంభర, చిలకలగూడ : చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు పెడ్లర్లు, నలుగురు వినియోగదారులను టాస్క్ ఫోర్స్, చిలకలగూడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం మేరకు సికింద్రాబాదు జోన్ టాస్క్ ఫోర్స్, చిలకలగూడ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి చిలకలగూడలోని రైల్వే క్వార్టర్ నం.1003 సమీపంలో గంజాయి విక్రయిస్తున్న సుభాష్ మిషాల్, పబిత్ర బీరా, బాపున్ బిడికాలను పట్టుకున్నారు. వారితో పాటు గంజాయి వినియోగిస్తున్న మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా నుంచి గంజాయిని హైదరాబాదు నగరానికి రవాణా చేసి వినియోగదారులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్‌లో నిందితుల వద్ద నుంచి సుమారు రూ.4.38 లక్షల విలువైన 11.530 కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, రెండు గ్రాముల లూజ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన సరఫరాదారుడు మల్లి పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో సికింద్రాబాదు జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జె. రాజశేఖర్, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ వి. రామకృష్ణ, సబ్ ఇన్‌స్పెక్టర్లు బి. మహేష్, సి. చంద్రయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: