కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్బంగా శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు

కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్బంగా శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు

విశ్వంభర,  చార్మినార్:-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టినరోజు వేడుకలు చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, చిత్రపటాన్ని బెలూన్లతో గాలిలోకి ఎగరవేశారు. చార్మినార్ అంత ఎత్తు రాజకీయాలలో  ఎదగాలని చార్మినార్ ఇన్చార్జ్ రాధాకృష్ణ తెలిపారు. అనంతరం బేల చౌరస్తాలోని ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలకు పండ్లు అందజేశారు. అనంతరం మైలార్ దేవులపల్లి కి చెందిన శ్రీనివాస్ మంజుల మొదటి సంతానం అమ్మాయికి కవితపేరు నామకరణo చేశారు. కవిత జన్మదిన సందర్భంగా అమ్మాయి కూడా అంత ఎత్తు ఎదగాలని కోరుకుంటున్నామని అలాగే కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణికొండ విజయ్ కుమార్, అంబటి రాజేష్, భాను ప్రసాద్ గంగపుత్ర, నీరజ ప్రియాంక వెంకటేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: