బీఎంఎస్ అధ్యక్షుడు మల్లేష్ జన్మదిన వేడుకలు

బీఎంఎస్ అధ్యక్షుడు మల్లేష్ జన్మదిన వేడుకలు

విశ్వంభర, బాలనగర్ : అఖిల భారత భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు, ఉద్యోగ భవిష్య నిధి సంస్థ కేంద్ర ట్రస్టీ బోర్డు సభ్యుడు సుంకరి మల్లేష్ జన్మదిన సందర్భంగా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో జరిగిన  జన్మదిన వేడుకలలో పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగుల సహభాగిత పెన్షన్ పథకం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ నిరంతరం పోరాటం చేస్తుందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజర్ రామ్మోహన్, సీనియర్ నాయకులు జయేందర్, భారతీయ మజ్దూర్ సంఘ్ బీఎంఈయూ జనరల్ సెక్రటరీ టి. కృష్ణ, అదనపు జనరల్ సెక్రటరీ ప్రదుమన్, ఖజాంచి వెంకటేష్, సీనియర్ నాయకుడు శ్రీధర్, హైదరాబాదు జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ పాల్గొన్నారు.

Tags: