శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ జాతర 

శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ జాతర 

విశ్వంభర, చింతపల్లి: హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై చింతపల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ  ఆలయంలో నేటి నుండి మూడు రోజుల పాటు  ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గురువారం దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ మాత వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, అమ్మవారి దయ, కరుణా, కటాక్షాలతో శాంతి, సుభిక్షాలతో మరింత అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ పూజారి గండికోట శేఖర్ అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాసారపు శ్వేతా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొండూరు పవన్ కుమార్, ఎరుకల వెంకటయ్య గౌడ్, ముచ్చర్ల యాదగిరి, లింగంపల్లి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీలు జంగిటి నరసింహ, హరి నాయక్, మాజీ సర్పంచులు కాయితి జితేందర్ రెడ్డి, అంగిరేకుల గోవర్ధన్, దాసరి శ్రీనివాస్ యాదవ్, గోవిందు రవి కుమార్, కిన్నెర హరికృష్ణ, చెట్లపల్లి హరిప్రసాద్, వందనపు ఆంజనేయులు, ఎండి సిద్ధిక్ బాబా, ఎల్లంకి రాధాకిషన్, దాసరి రాజు, కొప్పుల శ్రీనివాస్,   గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: