పేదలకు విద్య దూరం చేసేలా ఉంది
- విద్యా కమిషన్ రిపోర్ట్ పై టిపిటిఎఫ్
విశ్వంభర, నెల్లికుదురు: విద్యా కమిషన్ రిపోర్టు గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థులకు విద్య అంద కుండా దూరం చేసేలా ఉందని టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురు ఎమ్మార్సీ ఎదుట ఆ శాఖ మండల అధ్యక్షుడు యాకయ్య అధ్యక్షతన గురువారం అత్యవసర సమావేశం జరిగింది. దీనికి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ, పాఠశాలల వికేంద్రీకరణ జరగకుండా ఒకే చోట కేంద్రీకరించేలా రిపోర్ట్ ఇవ్వడం దారుణమ ఏడి న్నారు. డి ఈ డి స్థానం లో పి.జి, బీ.ఈ.డి , ప్రైమరీ, బీ. ఈ.డి సెకండరీ గా మార్చాలని సూచించడం కమిషన్ తన పరిధిని మించి సిఫారసు చేసిందని, దీంతో డి.ఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు నిరుద్యోగులుగా మరే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్స్ ను కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేసుకోవాలని సూచించడం విద్య రంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించేలా ఉందన్నారు.యాకయ్య మాట్లాడుతూ, ఉద్యోగులకు చెల్లించాల్సిన డీ ఏ లు,బకాయిలు చెల్లించకుండా వేతనాలు అదికంగా ఉన్నాయని సూచించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి విద్యారంగం పట్ల చిత్త శుద్ది ఉంటే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో, విద్యారంగ నిపుణులతో సూచనలు సలహాలు స్వీకరించి నివేదికను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు నవీన్, సంపత్, మధు బాబు తదితరులు పాల్గొన్నారు.



