గోస్పెల్ గ్లోబల్ మినిస్ట్రీస్ వార్షికోత్సవం

గోస్పెల్ గ్లోబల్ మినిస్ట్రీస్ వార్షికోత్సవం

విశ్వంభర, బాలానగర్: కూకట్పల్లి  నియోజకవర్గ  పరిధిలోని బాలానగర్ అంబికా కాలనీలోని గోస్పెల్ గ్లోబల్ చర్చ్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్, టిపిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా  బండి రమేష్ మాట్లాడుతూ, పేదలకు,  మైనార్టీలకు  కాంగ్రెస్ ప్రభుత్వ  అండదండలు ఎప్పుడు అన్నారు. రాష్ట్రంలో ప్రజలు అన్ని మతాలవారు సోదర భావంతో మెలగాలని అంకితభావంతో ముందుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిషప్ పాల్, క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Tags: