హలాల్ వద్దు.. జట్కానే ముద్దు
విశ్వంభర, చింతపల్లి : హలాల్ వద్దు.. జట్కా పద్ధతులే హిందువులకు ముద్దు అని బజరంగ్ దళ్ , విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ, హిందువులు మన దేవుళ్ళకు మొక్కులు చెల్లించే పద్ధతి జట్కా పద్ధతిలో చేసుకోవాలని హలాల్ అనేది అన్యమతస్తుల పద్ధతి మనం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించే మేక, కోడి, ఇతర జీవులను బలి ఇవ్వాలంటే హలాల్ చేస్తే హిందూ దేవుళ్లకు నైవేద్యంగా పనికిరాదని కావున హిందూ బంధువులందరూ కూడా కచ్చితంగా ప్రతి ఒక్కరూ జట్కా పద్ధతులే పాటించాలని తెలియజేశారు. హిందూ బంధువులందరూ కూడా అమ్మవారికి జట్కా పద్ధతిలోనే మేక, కోడి, ఇతర జీవులను సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శివర్ల రమేష్, కుకడపు రామకృష్ణ, సోమరాజు ప్రదీప్, బొడ్డు మహేష్, గంగలి వెంకటయ్య, మోర వెంకటరమణ, గజ్జె అభినవ్, కంచుకట్ల వినోద్, మొగిలమోని రవి, కడారి కృష్ణ, కోప్పుల శంకర్, చింటూ, తదితరులు పాల్గొన్నారు.



