పరిశుభ్రతను పాటిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

పరిశుభ్రతను పాటిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

విశ్వంబర /కౌకుంట్ల:- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలంలో గ్రామ సర్పంచ్ ఉల్లి నరేష్ ఈరోజు గ్రామంలోని ప్రతి రోడ్డును,శుభ్రపరుస్తూ పరిశుభ్రమైన వాతావరణం కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉల్లి నరేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు చెత్తను, ఎక్కడపడితే అక్కడ వేయకూడదని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని. గ్రామం స్వచ్చంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకొని పరిశుభ్రతను పాటించాలని తెలిపారు.

Tags: