గాంధీలో సేవలు నిలిపివేతపై ఆందోళన

గాంధీలో సేవలు నిలిపివేతపై ఆందోళన

విశ్వంభర, హైదరాబాదు : రూ.17 కోట్ల పెండింగ్ బిల్లుల కారణంగా గాంధీ దవాఖానలో అత్యవసర టెస్టింగ్ సేవలు నిలిచిపోవడం ఆందోళనకరమని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కన్వీనర్ బుర్ర రాము గౌడ్ పేర్కొన్నారు. పేదలకు ఆసరాగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విధంగా సేవలు ఆగిపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోందని విమర్శించారు. ప్రతిరోజూ వేలాది మంది రోగులు చికిత్స కోసం గాంధీ దవాఖానకు వస్తున్న సమయంలో టెస్టింగ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి టెస్టింగ్ సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అత్యవసర సేవలను తక్షణమే ప్రారంభించకపోతే ప్రజల తరఫున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Tags: