నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

విశ్వంభర, మహబూబాబాద్ : మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ ,కోడులుగా కుదించి కార్మిక హక్కులను, హరించడాన్ని వ్యతిరేకిస్తూ  ఐ ఎఫ్ టి యు జాతీయ కమిటీ, పిలుపు మేరకు ఈనెల 16న  మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, 23న హైదరాబాదులో సెంట్రల్ లేబర్ కమిషనరేట్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం  చేయాలని  ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు . జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ్య భవనంలో ఏర్పాటు చేసిన  సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన  హాజరయ్యారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కార్మిక హక్కులను కాలరాస్తూ యాజమాన్యాల కు అనుకూలంగా ఈ కోడులలో మార్పులు చేశారని అన్నారు. కనీసం కార్మికులు యూనియన్లు పెట్టుకొని యాజమాన్యాలతో బేర సారాలు చేసుకునే హక్కును, సమ్మె చేసే హక్కును, వేతనాలు పెంచాలని కోరే హక్కును కూడా నిరాకరించారని ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని అన్నారు.  ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి శివారపు శ్రీధర్ జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ లింగన్న , సామ పాపయ్య , శోభన్, భూక్య రాము, పి బాల మల్లు, కట్ల నాగరాజు, అల్లి ఏకాంబరం, సంగం నాయకులు , తదితరులు పాల్గొన్నారు .

Tags: