మహిళలకు ‘నారీ జాబ్ మేళా’

మహిళలకు ‘నారీ జాబ్ మేళా’

విశ్వంభర, గోల్నాక : సయోధ్య సంస్థ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు–2026లో భాగంగా గోల్నాక తులసీరామ్ నగర్‌లో నిర్వహించిన ‘నారీ జాబ్ మేళా–2026’ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, మేడ్ ప్లస్, డీమార్ట్ సంస్థల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించగా సుమారు 150 మంది మహిళలు హాజరై ఉద్యోగ అవకాశాలు పొందారు. ఈ కార్యక్రమంలో మృదుల వేములపాటి, బిక్షపతి యాదవ్, బాబు, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: