అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
On
విశ్వంభర, పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఇంద్ర నగర్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్ ను వాణిశ్రీ కి మున్సిపల్ చైర్పర్సన్ కుడుముల రజిత వెంకటేష్, కౌన్సిలర్ బాదం అఖిలా శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, కౌన్సిలర్లు ఎజాజ్, ఆరిఫ్ , కాంగ్రెస్ నాయకులు మాణిక్యం,తదితరులు పాల్గొన్నారు.



