మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత

 విశ్వంభర, అనంతగిరి: పోలీసు శాఖ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అనంతగిరి ఎస్ఐ నవీన్  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వo అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ ప్రజా భరోసా ఆధ్వర్యంలో బుధవారం అనంతగిరి మహిళా సమభావన సంఘం కార్యాలయం నందు మహిళా భద్రత రక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా  ఎస్సై నవీన్ కుమార్ మాట్లాడుతూ మహిళలు బాలల పట్ల చట్టాలు బలోపేతం చేయబడ్డాయని ఎవరైనా వేదింపులకు గురి చేసినట్లయితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పోలీస్ శాఖ మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే పోలీసు వారు బాధితుల ఇంటి వద్దకు వచ్చి ఫిర్యాదులు స్వీకరించి ఇంటి వద్ద నుండి కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. అపరిచితులకు మన గుర్తింపు వివరాలు బ్యాంకు వివరాలు ఇచ్చినట్లయితే సైబర్ మోసాలు చేస్తారని ఆర్థిక నష్టం కలిగిస్తారని సూచించారు.

Tags: