పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల కృషి 

పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల కృషి 

  • బీరువా వితరణ 
  • ప్రతిభ కనబర్చిన విద్యార్దులకు నగదు బహుమతులు

విశ్వంభర, మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001 - 02  సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్దులు పాఠశాలపై ఉన్న మమకారంతో పాఠశాలలో సౌకర్యార్థం పాఠశాలకు బీరువా  అందజేశారు.4 సీసీ కెమెరాలు ఏర్పాటు తోపాటు 2025 - 26 సంవత్సరంలో 10 వ తరగతిలో పాఠశాలలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి 12 వేల రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్ధికి 7 వేల రూపాయలు,తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్ధికి 5 వేల రూపాయలు నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేస్తామని  ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి తల్లమల్ల మల్లేశం పాల్గొని మాట్లాడారు..చదివిన పాఠశాలను చదువు చెప్పిన గురువులను మరచిపోకుండా గుర్తు ఉంచుకొని పాఠశాలలో  సౌకర్యాలు  ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం..ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్దులకు ఆర్ధికంగా బరోసా కల్పించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో.2001 - 02 పూర్వ విద్యార్ధులు పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్,కూరెళ్ళ జ్ఞానేశ్వర్,ఈద ప్రవీణ్,బొల్లు సైదులు,చెరుకు నరేందర్, ముచ్చపోతుల శ్రవణ్ కుమార్ నారగోని శ్రీశైలం,పాఠశాల చైర్మన్ పందుల ఎల్లమ్మ,పాఠశాల ఉపాధ్యాయులు కే సత్తిరెడ్డి,రత్నయ్య,అన్నపురెడ్డి, వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: