మంత్రి దామోదర్ ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్
On
విశ్వంభర, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన నందిగామ గ్రామ మాజీ సర్పంచ్ శివానందం జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు.నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా కలిసి, తనపై నమ్మకం ఉంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాదాసు రాజశేఖర్‌తో పాటు మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొని మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు.



