ఘనంగా గ్రామ పండుగ వేడుకలు 

ఘనంగా గ్రామ పండుగ వేడుకలు 

విశ్వంభర, చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్ ఆధ్వర్యంలో గ్రామ పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి హాజరై గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గ్రామంలో ఐకమత్యం, సాంప్రదాయాలను కాపాడుకునేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అత్తిలి అనంతరెడ్డి, జిల్లా నాయకులు వెంకటరెడ్డి, దేవుని ఎర్రవల్లి మాజీ సర్పంచ్ మాణిక్య రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కుంచం శ్రీనివాస్ గుప్తా, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: