గ్రామాభివృద్దే లక్ష్యం
On
విశ్వంభర, షాబాద్: షాబాద్ మండలం రుద్రారం గ్రామంలో అమెజాన్ సంస్థ సహకారంతో నిర్మించిన అంగన్వాడి భవనం ప్రారంభోత్సవానికి గ్రామపంచాయతీ అధికారిక ఆహ్వానం మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి హాజరుయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పదవులు తమకు ముఖ్యం కాదని, రుద్రారం గ్రామ అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులే తమ నిజాయితీకి నిర్దేశనమని తెలిపారు.



