న్యాయవాదుల విధుల బహిష్కరణ
విశ్వంభర, రామన్నపేట: బుధవారం రోజు రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని రామన్నపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగకుండా, తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావలసిన అవసరం ఉందని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండీ మజీద్ అన్నారు. నిరంతరం అడ్వకేట్ లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. ఆస్తి కోసం ఇలాంటి దాడులు, హత్యలు చేయడం అత్యంత హేయమని అన్నారు. ఆస్తి వివాదాల కోసం కోర్టులను ఆశ్రయించాలని, ఇలాంటి దాడుల వైపు వెళ్లొద్దని కోరారు. ఈ సందర్భంగా యువ న్యాయవాది స్వప్న మరణం పట్ల ఆమె ఆత్మశాంతి కోసం నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమములో బార్ అసోసియేషన్ అద్యక్షులు ఎం.ఏ మజీద్, ఉపాద్యక్షులు యాదాసు యాదయ్య, సీనియర్ న్యాయవాదులు జినుకల ప్రభాకర్, కేమ రామదాసు, బాసరాజు అశోక్ కుమార్, జగతయ్య, శ్రీశైలం, కూనూరు శ్రీనివాస్, నూతి రమేష్, సతీష్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.



