కోట మైసమ్మ దేవాలయంలో కటకం రమేష్ ప్రత్యేక పూజలు
సీపీఐ పార్టీ బలపరిచిన 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కటకం రమేష్ ప్రచారం
విశ్వంభర, చండూర్:- సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కటకం రమేష్ చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పదో వార్డు నుండి పోటీ చేస్తున్నారు. మొదటి రోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా 10వ వార్డులో ఉన్నటువంటి శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కరపత్రాలను అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం పదో వార్డులోని ఇంటింటికి వెళ్లి పదో వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నానని ప్రతి ఒక్కరూ చెయ్యి గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థి కటకం రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాపై నమ్మకం ఉంచి నన్ను పదో వార్డు నుండి సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం దక్కినందుకు చాలా సంతోషపడుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందిస్తుందని, ఆ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరువయ్యాయని, ఆ ప్రజాపాలన వచ్చిన తరవాత ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ వస్తుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి అలాగే చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో ఆశీర్వాదాలతో ముందుకు సాగుతూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనీ అన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో చండూరు పురపాలకలో కాంగ్రెస్ పార్టీ పీఠం కైవసం చేసుకోబోతుందని, పది వార్డులకు సంబంధించిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అయితరాజు మల్లేష్, కావలి ఆంజనేయులు, బొబ్బల శ్రీనివాస్ రెడ్డి, దోటి వెంకన్న, ఏలే శ్రీనివాసులు, కోయిగూర శేఖర్, కావలి సురేష్, వనం విజయ్ తదితరులు పాల్గొన్నారు



