బి ఆర్ఎస్ మాయ మాటలు నమ్మకండి
విశ్వంభర, సదాశివపేట్: సదాశివపేట పట్టణంలో గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ 8వ వార్డు ప్రజలకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ, 8వ వార్డు అభివృద్ధిని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ట్యాంక్ ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయం అంటే వ్యాపారం కాదు, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం, ప్రజలకు వాళ్ల సమస్యలను పరిష్కరించి, వార్డు అభివృద్ధి చేయడం అని చెప్పారు. 8వ వార్డు ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించి వార్డ్ అభివృద్ధికి కావలసిన పనులను అన్నిటిని చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వార్డు అభివృద్ధి కోసం వెనుకడుగు వేయకుండా ఎల్లప్పుడూ అండగా ఉంటూ 8వార్డును తీర్చిదిద్దుతానని తెలియజేశారు. అనంతరం న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, బిఆర్ఎస్ పార్టీ ప్రజలను నమ్మించి గొంతు కోసిన పార్టీ, ఎంతోమంది విద్యార్థులను రోడ్డుపైకి తీసుకువచ్చిన పార్టీ, 8వ వార్డును సర్వనాశనం చేసిన పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు రజాక్, వసీం, శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు మంజుల ఈశ్వర్ గౌడ్, యువకులు, మైనార్టీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



