అంగరంగ వైభవంగా శ్రీమార్కండేశ్వర జాతర
On
విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది.దేవాలయ ప్రాంగణం మొత్తం దీప కాంతులతో ప్రకాశించేలా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.బుధవారం నుండి మొదలైన 27 వ బ్రహ్మోత్సవాల్లో ఆదివారం జరిగే కల్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.జిల్లా వ్యాప్తంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ అధ్యక్షులు సూరేపల్లి కుచేలు అన్నారు.



