మొక్కల సంరక్షణలో వన సేవకుల పాత్ర  కీలకం

మొక్కల సంరక్షణలో వన సేవకుల పాత్ర  కీలకం

 విశ్వంభర,నెల్లికుదురు: మొక్కల సంరక్షణలో వన సేవకుల పాత్ర కీలకమని ఎంపీడీవో సింగారపు కుమార్ అన్నారు. మండలంలోని నల్లగుట్ట తండా గ్రామపంచాయితీ నర్సరీలో బుధవారం సర్పంచి గుగులోతు హేమలత అధ్యక్షతన జరిగిన మండల వన సేవకుల సమావేశానికి ఎంపీడీవో హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలలోని మొక్కలకు సమయానుకూలంగా నీరు అందించి నిరంతరం వాటి పెరుగుదలకు కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువుల  బెడద నుంచి మొక్కలను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పద్మ,ఏపీవో మాధవి, వివిధ గ్రామాల పంచాయితీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వన సంరక్షకులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews