సోడా తాగి..రూ.లక్ష సాయం చేసిన జగ్గారెడ్డి!
- దేవుడు ఆదేశించిండు నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చిన..*
- *నీకు లక్ష రూపాయలు సాయం చేసిన!*
- *సదాశివపేటలో నిమ్మ సోడా అమ్మే మహిళతో చెప్పిన జగ్గారెడ్డి*
- *ఎవరైనా కష్టంలో ఉన్నారంటే తక్షణమే స్పందించి సాయం చేసే గుణం నాది*
- *తన తల్లిదండ్రులు అట్లాంటి పుట్టుకను ఇచ్చారని వివరించిన జగ్గారెడ్డి
విశ్వంభర, సదాశివపేట:-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సదాశివపేట పట్టణంలో పర్యటించారు.ఆయన కారు దిగి వెళ్తుండగా నిమ్మ సోడా అమ్మే బండి కనిపించింది. ఆయన అక్కడ ఆగారు. నిమ్మకాయ సోడా తాగుతూ ఆ బండిని నడుపుతున్న మహిళతో ముచ్చటించారు.*“ఏమ్మా ఎట్లా ఉంది వ్యాపారం.. మంచిగా జరుగుతోందా” అని అడిగారు. “ కొత్త మెషిన్ కొనుక్కుంటే సోడాల గిరాకీ ఎక్కువవుతుంది. ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో ఏమీ మిగలడం లేదు. మీరు ఏదైనా సాయం చేస్తే బండి మంచిగా నడుపుకుంటాం” అంటూ ఆ మహిళ చెప్పింది. “ఎన్ని డబ్బులు ఇస్తే సోడా మిషన్ వస్తుంది? మీరు మంచిగా బతకగలుగుతారు? “ అని జగ్గారెడ్డి అడిగారు.**“లక్ష రూపాయలు పెడితే కొత్త మిషన్ వస్తుంది. ఈ ఎండాకాలంలో రోజుకు మూడు వేల రూపాయల దాకా వ్యాపారం అవుతుంది. మీరు సాయం చేస్తే మంచిగా బతుకుతం” అంటూ ఆ మహిళ బదులిచ్చింది. వెంటనే జేబులోంచి లక్ష రూపాయలు తీసిన జగ్గారెడ్డి.. “ ఇదిగో ఈ లక్ష రూపాయలు తీసుకో.. ఎండాకాలం వచ్చేలోగా సోడాల మిషన్ కొనుక్కో. రోజుకు మూడు వేలు సంపాదించు” అంటూ ఆమెకు లక్ష రూపాయలు అందించారు.** అప్పటికప్పుడే లక్ష రూపాయలు ఇస్తాడని ఊహించని ఆ మహిళ.. “అయ్యో సార్.. ఇప్పుడే ఇచ్చేస్తున్నారా” అంటూ సంతోషపడ్డది. జగ్గారెడ్డికి నమస్కరించింది.* *ఈ లక్ష రూపాయలతో మీరు బాగుపడాలి మంచిగా వ్యాపారం జరగాలి అంటూ చెప్పి జగ్గారెడ్డి అక్కడి నుంచి ముందుకు వెళ్లారు.* *“దేవుడు ఆదేశించాడు.. నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చాను. సోడా అమ్మే నీకు లక్ష సాయం జరగాలని రాసి పెట్టి ఉంది. అందరికీ సాయం చేసే పుట్టుకను నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు” అనే మాటలు ఈ సందర్బంగా జగ్గారెడ్డి నోటి నుంచి వచ్చాయి.*



