ధైర్యంతో  క్యాన్సర్ ను జయించవచ్చు

ధైర్యంతో  క్యాన్సర్ ను జయించవచ్చు

  • కె.ఎల్.ఆర్ 

 విశ్వంభర. మహేశ్వరం: క్యాన్సర్  మహమ్మారిని ముందే గుర్తించాలి కాలుష్యం,  ఆహార కల్తీ పదార్థాలతో జాగ్రత్త జీవనశైలిలో మార్పులు, ఆహార అలవాట్లు, ఇన్ఫెక్షన్లు, జన్యుపరమైన వ్యాధులతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ కెమిస్ట్రీ అధ్యాపకులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ, భవిష్యత్ లో చిన్న,పెద్ద తేడా లేకుండా అత్యంత ప్రమాదకరంగా క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తుందని అన్నారు. క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తిస్తే. ట్రిట్ మెంట్ ద్వారా నయంచేయవచ్చన్నారు. క్యాన్సర్ బారిన పడ్డ ఎంతో మంది ప్రముఖులు సైతం ధైర్యంతో ఎదుర్కొని ఇతర రోగులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్లు హెచ్ ఓ   నివేదిక ప్రకారం పర్యావరణ కాలుష్యం, ఆహార, జీవన శైలిలో మార్పుల వల్ల 37శాతం క్యాన్సర్ సంభవిస్తుందని  తెలిపారు.  క్యాన్సర్ వ్యాధి  అత్యంత ప్రమాదకరంగా మారిందని ,  క్రమం తప్పకుండా పరీక్షలు చేయించు కోవాలని,  వ్యాయమం చేయాలని  సూచించారు. పొగాకు ఉత్పత్తులు, మద్యపానం, ఆహార కల్తీకి దూరంగా ఉండాలి తెలిపారు.

Tags: