జాతీయ సమైక్యతా శిబిరానికి 

జాతీయ సమైక్యతా శిబిరానికి 

  • రామన్నపేట విద్యార్ధి ఎంపిక   

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ ప్రథమ సంవత్సరం చదువుచున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్ నోముల సాయి తేజ ఫిబ్రవరి 16 నుండి 22 వరకు, ఏడు రోజులపాటు బీహార్ రాష్ట్రంలోని సస్రాంలో జరిగే జాతీయ సమైఖ్యతా శిబిరానికి ఎంపికయ్యారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లలో నైపుణ్యాలు పెంచే దిశగా భారత ప్రభుత్వ క్రీడలు , యువజన సర్వీసుల శాఖ ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ పాట్నా ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్రంలోని సస్రాంలోని శాంతి ప్రసాద్ జైన్ కాలేజిలో ఈ నెల  16  నుంచి నిర్వహించే జాతీయ సమైక్యత శిబిరానికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఎంపికకు సంబంధించి కల్చరల్  అంశాలలో ప్రతిభ కనబర్చి జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికైన సాయి తేజను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం, వైస్-ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జే.చిన్నబాబు, జాతీయ సేవా పథకం యూనిట్-1 ప్రోగ్రాం అధికారి తాటిశెట్టి శ్రీనివాసులు తదితర అధ్యాపక సిబ్బంది అభినందించారు.

Tags: