ఉపాధి హామీ పనులు ప్రారంభం 

ఉపాధి హామీ పనులు ప్రారంభం 

విశ్వంభర,  చింతపల్లి: మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను, ఉపాధి హామీ కూలీలతో కలిసి, గ్రామ సర్పంచ్ నల్ల సుమిత రఘుమారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామ పరిధిలో చేపట్టనున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. సర్పంచ్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ పథకం ద్వారా గ్రామ ప్రజలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ పనులను నాణ్యతతో పారదర్శకంగా చేపట్టాలని సంబంధిత అధికారులతో అన్నారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు అందిస్తున్న  భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్థులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: