గురుకు శివకు నివాళులు
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు గురుకు శివ అనారోగ్య కారణాలవల్ల చనిపోవడం బాధాకరం అని, గురుకు శివ మృతదేహానికి పూలమాలేసి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించినారు. గురుకు శివ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జినుకల ప్రభాకర్, సాల్వేర్ అశోక్, ఎండి నాసర్, గోదాసు శ్రీమన్నారాయణ, బొడ్డు సాలయ్య, వనం చంద్రశేఖర్, బొడ్డు శంకరయ్య, మహమ్మద్ జానీ, ఎండి అజార్, కొమ్ము రామస్వామి, గొలుసుల ప్రసాద్, బొడ్డు సైదులు, మినముల సందీప్ తదితరులు పాల్గొన్నారు.



