ఇనుగుర్తి లో ఘనంగా నేతాజీ జయంతి
విశ్వంభర,ఇనుగుర్తి: బ్రిటిషర్లను గడగడలాడించిన నేతాజీ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు మండల కేంద్రం ఇనుగుర్తిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఎస్సై గంగారపు కరుణాకర్ సర్పంచి తమ్మడపల్లి కుమార్,సంఘం అధ్యక్షులు పప్పుల వెంకన్న తదితరులతో కలిసి నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, స్వాతంత్రోద్యమ చరిత్రలో చంద్రబోస్ అసాధారణ పోరాట యోధుడని కొనియాడారు. పలువురు వక్తలు మాట్లాడుతూ, స్వతహాగా ఆర్మీ ని ఏర్పాటు చేసి పరాయి దేశస్తులపై పోరాటం చేసిన ధీరుడు నేతాజీ అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వేముల శ్రీనువాస్ గౌడ్,చిన్నాల పరశురాములు, నదునూరి ప్రశాంత్ దిశ సభ్యులు గుజ్జునూరి బాబురావు వివిధ పార్టీల నాయకులు,అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు కూరెల్లి సతీష్,గండు నాగన్న గౌడ్,గంజి రాజేందర్ రెడ్డి,చిన్నాల కట్టయ్య యాదవ్,గుండ్రపల్లి శ్రీనివాస్,పప్పుల వెంకన్న(టీచర్)డా.వెంకటేశ్వర్లు,బూర రజిని,దుంపల సందీప్,గుండ్రపల్లి శ్రీనివాస్,చైతన్య, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.



