ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కడం విచారకరం
On
విశ్వంభర, చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో 17 వ వార్డు ఏకగ్రీవం విషయంలో హైడ్రామా నడిచిందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నామినేషన్ విత్డ్రాకు చివరి రోజు కావడంతో మున్సిపల్ కార్యాలయంలో 17 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి చింతల ఉమా మహేశ్వరి సాయిలు బీఫామ్ పక్కకు పెట్టి.. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆర్వో ,కమిషనర్ల ముందే కార్యాలయంలో సుమారు 15 మంది చొరబడ్డారన్నారు . కాంగ్రెస్ కు అనుకూలంగా ఏకగ్రీవం అయ్యేలా వ్యవహరించారు అని అన్నారు . ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డు అయిందన్నారు. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కడం విచారకరం అని, దీనిపై ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.



