ప్రచారంలో దూసుకుపోతున్న డా. కోడి శ్రీనివాసులు

6వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పెరుగుతున్న ప్రజాదరణ

ప్రచారంలో దూసుకుపోతున్న డా. కోడి శ్రీనివాసులు

విశ్వంభర, చండూర్:- సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ 6వ వార్డ్ అభ్యర్థిగా డా. కోడి శ్రీనివాసులు ప్రచారం జోరుగా సాగుతుంది. చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ వార్డు నుండి పోటీ చేస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమంలో ప్రజల మద్దతు తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డ్ ప్రజలు ఇంటింటి ప్రచారానికి వచ్చిన డా. కోడి శ్రీనివాసులు కు బ్రహ్మరధం పడుతున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 6వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నానని ప్రతి ఒక్కరూ ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాపై నమ్మకం ఉంచి నన్ను 6వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం దక్కినందుకు చాలా సంతోషపడుతున్నాను. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి అలాగే చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో ఆశీర్వాదాలతో ముందుకు సాగుతూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనీ అన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో చండూరు పురపాలకలో కాంగ్రెస్ పార్టీ పీఠం కైవసం చేసుకోబోతుందని, పది వార్డులకు సంబంధించిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: