నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
విశ్వంభర,ఇనుగుర్తి: వేసవి ఆరంభం కావస్తున్న దృష్ట్యా ఇనుగుర్తి మండలంలోని అన్ని గ్రామాలు, తండాలలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎం పిడిఓ బండారి పార్థసారథి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు నీటి ఎద్దడి,ఇందిరమ్మ ఇండ్లు, ఎన్ఆర్ఈజీఎస్, నర్సరీల నిర్వహణపై ఎంపీడీవో రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు వేగవంతంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటూనే ఈజీఎస్ ద్వారా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం చేసేలా చూడాలన్నారు.ఉపాధి పనుల్లో గ్రామ గ్రామాన 100 మంది కూలీలకు తక్కువ కాకుండా పనులు కల్పించాలని పేర్కొన్నారు.నర్సరీలలో గతంలో ఉన్న మొక్కలకు నిరంతరం నీరు అందిస్తూనే కొత్త విత్తనాలను విత్తేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో దీప్ల,పంచాయతీ కార్యదర్శులు బొమ్మెర వాణి,గండు అనిల్ కుమార్ గౌడ్,లక్ష్మీకాంత్, జాఫర్, వినోద్,సారిక,రాజేష్, ముఖేష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.



