చండూర్ లో ఊపందుకున్న కారు స్పీడ్

10వ వార్డులో గులాబీ జెండా ఎగరడం ఖాయం. -  మాజీ ఎంపీపీ తోకల వెంకన్న 

చండూర్ లో ఊపందుకున్న కారు స్పీడ్

విశ్వంభర, చండూర్ ;- చండూరు 10వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్తపాటి సతీష్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థి కొత్తపాటి సతీష్ కు  మద్దతుగా మాజీ ఎంపీపీ తోకల వెంకన్న రంగంలోకి దిగి  ఇంటింటి ప్రచారంలో  దూసుకుపోతున్నారు.  సతీష్ ,వెంకన్న కలిసి వార్డులోని పలు కాలనీల్లో పర్యటించారు. ఇంటింటికీ, షాపు షాపుకూ, గడపగడపకు తిరుగుతూ.. కేసీఆర్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల ఆశీర్వాదం పొందుతూ ముందుకు సాగుతున్నారు. అభివృద్ధే లక్ష్యంగా, సంక్షేమమే అజెండాగా ముందుకు వెళ్తున్న సతీష్ ను కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపిపి తోకల వెంకన్న , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ ప్రజలను కోరారు. 

Tags: