విద్యుదాఘాతంతో ఆవు మృతి 

విద్యుదాఘాతంతో ఆవు మృతి 

విశ్వంభర,  బోడుప్పల్: జిహెచ్ఎంసి బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్  ప్రధాన రహదారిలో బయన్న గూడ లో ఓ ఆవు  విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి విద్యుదాఘాతానికి గురై  మృతి చెందింది. ప్రతిరోజు దాదాపు 10 లీటర్ల పాలు ఇచ్చే ఆవు చనిపోవడంతో తమ కుటుంబం రోడ్డున పడుతుందని  వల్లపు రమేష్  ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా మేకలు, ఆవులు  ఇలాగే కరెంట్ షాక్ తో మృతి చెందాయని గత ఐదు సంవత్సరాలుగా పలుమార్లు విద్యుత్ అధికారులకు ఫెన్సింగ్ వేయమని ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags: