నల్లవాగు ధోబిఘాట్ లో వెలుగులు 

నల్లవాగు ధోబిఘాట్ లో వెలుగులు 

 విశ్వంబర,  చంద్రాయన గుట్ట :  చంద్రాయన గుట్ట నియోజకవర్గంలోని నల్లవాగులో దోబీ ఘాట్ ఏర్పాటు అయిన సంవత్సరం నుండి విద్యుత్తు లేక చాలా ఇబ్బందులు పడ్డారు, ఇన్నాళ్లకు  జోనల్ బడ్జెట్లో నిధులు కేటాయించి దోబీ ఘాట్ లో వెలుగులు నింపారు. దీంతో   జిహెచ్ఎంసి వారికి దోబీ ఘాట్  సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రాయన గుట్ట కాంగ్రెస్ ఇంచార్జ్ బోయి నగేష్, వెంకటేష్ పిసిసి సెక్రెటరీ , కాంటిస్టేడ్  కార్పొరేటర్ కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్ పాల్గొన్నారు. బోయ నగేష్ మాట్లాడుతూ,  మా ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఆ అభివృద్ధి పనులే మాకు విజయాలను అందిస్తున్నాయని మున్సిపల్ ఎన్నికలలో కూడా అధిక సంఖ్యలో సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. దోబీ ఘాట్  సంఘ సభ్యులు  మల్లేష్, వెంకటేష్, ఇమామ్ భాయ్,  ప్రభాకర్, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: