కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కదిలిన జగ్గారెడ్డి కుటుంబం

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కదిలిన జగ్గారెడ్డి కుటుంబం

  • సదాశివపేట లో జగ్గారెడ్డి సుడిగాలి పర్యటన..
    * ఇంటింటి  ప్రచారంతో హోరోత్తించిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి.
    * ⁠సంగారెడ్డి పట్టణంలో  ప్రత్యేక  ఆకర్షణగా జయాచైతన్య రెడ్డి ఇంటింటి ప్రచారం

IMG-20260205-WA1280విశ్వంభర్, సంగారెడ్డి:- ఎన్నికలకు కొన్ని రోజులే మిగిలి ఉండటంతో సంగారెడ్డి, సదాశివపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రచార వేగాన్ని పెంచింది. జగ్గారెడ్డి కూతురు జయాచైతన్య రెడ్డి, సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నారు.  జయాచైతన్య రెడ్డి సంగారెడ్డి పట్టణంలోని 21,19,29,8,27 వ వార్డులలో ప్రచారం నిర్వహించారు. 

ఇల్లుల్లు తిరుగుతూ, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జయాచైతన్య రెడ్డి అందరినీ ఆకర్షించారు. 
ప్రచారం సందర్భంగా  జయారెడ్డికి ప్రజలు తమ సమస్యలను వివరించారు. మీకు జగ్గారెడ్డి ఉన్నారు, ధైర్యంగా ఉండండి అంటూ ప్రజలకు భరోసా కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, సంగారెడ్డి పట్టణం అభివృద్ధిలో ముందుకు సాగాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణం లోని 24,25,26,05,38 వ వార్డులలో ఇంటిటి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ లోని 38 వార్డులలో అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని,  జగ్గారెడ్డి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి పట్టణానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి సంగారెడ్డి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు..
*సదాశివపేట లో జగ్గారెడ్డి సుడిగాలి పర్యటన..*

Read More పాక హనుమంతు (గణేష్ ఉయికె) 2022 నవంబర్ లో తల్లికి రాసిన ఉత్తరం

సదాశివపేటలో టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. సదాశివపేట శంభు లింగేశ్వర ఆలయం    మొదలుకుని దుర్గమ్మ గుడి, గాంధీ చౌక్, శాస్త్రి రోడ్, బస్టాండ్, సుభాష్  రోడ్, తిలక్ రోడ్ గుండా పాదయాత్రగా తిరుగుతూ సందడి చేశారు. వ్యాపారులను,ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు.  
గాంధీ చౌక్ లో ఒక దుకాణంలో కూర్చుని  కాంగ్రెస్ నాయకులు, పట్టణ ప్రజలతో సమావేశం అయ్యారు. చాయ్ తాగుతూ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులకు పలు సూచనలు చేశారు. సదాశివపేట పట్టణంలోని 26 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.

Tags: