కబడ్డీ టోర్నమెంట్ కరపత్రాలు ఆవిష్కరణ
విశ్వంభర,ఇనుగుర్తి: మహాశివరాత్రి పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న నాగారం చారిత్రక శ్రీ ముత్యాలమ్మ బోనాల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పురుషుల కబడ్డీ టోర్నమెంట్స్ ఈనెల 7, 8, 9 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఉప సర్పంచ్ తునపల్లి సతీష్,నాయకులు చెడుపాక యాకయ్య తెలిపారు.ఈ మేరకు టోర్నమెంట్ కరపత్రాలను ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం వారు వివరాలు తెలుపుతూ, ప్రథమ బహుమతిగా రూ.20 వేలు నగదు,షీల్డ్ బండారు మల్లారెడ్డి జ్ఞాపకార్థం కుమారుడు రామిరెడ్డి, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు ,షీల్డ్ కొయ్యడి పిచ్చమ్మ జ్ఞాపకార్థం ఆమె భర్త, కుమారుడు రామచందర్ గౌడ్, దయాకర్ గౌడ్, తృతీయ బహుమతిగా రూ.9 వేలు నగదు,షీల్డ్ బైరు మురళి అండమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమార్తెలు బహూకరించ నున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బైరు వెంకటేశ్వర్లు,బైరు వినయ్,మునిగంటి సరిత,చెడుపాక సురేష్ నాయకులు బైరు శ్రీనివాస్ గౌడ్,మునిగంటి రాజు,ప్రగతి వెంకన్న,గుర్రం వెంకన్న గౌడ్,ఉడుత యాకాంతం,బైరు రమేష్ గౌడ్,చెడుపాక వెంకన్న,శేఖర్,దర్గయ్య, గుండాల దుర్గా స్వామి,గోపగాని వినయ్, చెడుపాక ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.



