బీఆర్ఎస్ దోఖా కార్డుల పంపిణీ

బీఆర్ఎస్ దోఖా కార్డుల పంపిణీ

విశ్వంభర-సిద్దిపేట :   రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మి పదేండ్లు అధికారం అప్పగిస్తే ఆ పార్టీ, కేసీఆర్ కుటుంబం ప్రజలను దోఖా చేసిందని కాంగ్రెస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, కౌన్సిలర్లు సాకి ఆనంద్, ఆలకుంట మహేందర్ అన్నారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి, ఎన్నికల్లో ప్రజలకు  ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందంటూ జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో బీఆర్ఎస్ దోఖా కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, కౌన్సిలర్లు సాకి ఆనంద్, ఆలకుంట మహేందర్ మాట్లాడుతూ కేసీఆర్ పదేండ్లు అధికారంలో ఉండి సాధ్యం కానీ హామీలిచ్చి నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ భృతి, రేషన్ కార్డు, దళితబంధు, ఉద్యోగాలు, దళితులకు 3ఎకరాలు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాగానే బాకీ కార్డు అంటూ బీఆర్ఎస్ రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. ఎన్ని డ్రామాలు చేసినా బీఆర్ఎస్ను, కేసీఆర్ కుటుంబాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.  కేసీఆర్ కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగాలు సైతం అమ్ముకున్నారన్నారు, సిద్దిపేటలో అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, మా దగ్గర ఆధారాలు సైతం ఉన్నాయని.. దమ్ము ఉంటే అవినీతిపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కార్యక్రమంలో తప్పెట శంకర్, గ్యాదరి మధు, గయాజుద్దీన్, పయ్యావుల సందీప్ యాదవ్, హర్షద హుస్సేన్, రషద్ వాహబ్, విజయ్ డెనియల్, శ్రీకాంత్, పవన్, నజ్జు, శశిసాయి ప్రతాప్, సన రజిని, తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews