విశ్వసనీయతలో 'విశ్వంభర' భేష్

విశ్వసనీయతలో 'విశ్వంభర' భేష్

విశ్వంభర, సిద్దిపేట: విశ్వంభర దినపత్రిక రోజురోజుకూ ప్రజల మనసు చూరగొంటుందని అర్బన్ మండల తహసీల్దార్ హరికిరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అర్బన్ కార్యాలయంలో గురువారం సీనియర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మితో కలిసి పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరికిరణ్ మాట్లాడుతూ, విశ్వసనీయతలో 'విశ్వంభర' భేష్ అని అన్నారు. ప్రజల సమస్యలను వెలికితీయడంలో విశ్వంభర ముందుండాలని కాంక్షించారు.  ప్రజల పక్షపాతిగా పనిచేస్తేనే పత్రికలకు గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బక్క శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: