ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్
విశ్వంభర, సదాశివపేట: సదాశివపేట పట్టణంలోని 12 వవార్డులో గడప గడపకు తిరుగుతూ ప్రతి ఓటరును పలుకరిస్తూ కరపత్రాన్ని పంచుతూ 12 వ వార్డు అభ్యర్థి పులిమామిడి మమత రాజు దంపతులిద్దరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీ అందించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా పులి మామిడి రాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు అందుతున్నాయని అందువలనే ప్రజలందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని, బిఆర్ ఎస్ పార్టీ కనుమరుగై పోతుందని అన్నారు. సంగారెడ్డి , సదాశివపేట రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసు కోబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 12 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారీ, బక్కప్ప, ఫయాజ్, మొయిజ్, రియాజ్, షకీల్, సురేష్, పి. ఎం. ఆర్ యువసేన నాయకులు మాణిక్యం, పరమదాసు, సంగమేష్, తదితరులు పాల్గొన్నారు.



