10వ వార్డులో భారీ గెలుపు ఖాయం. - మాజీ ఎంపీపి తోకల వెంకన్న -- ఊపందుకున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్తపాటి సతీష్ ప్రచారం.
ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న
విశ్వంభర, చండూర్:- చండూరు మున్సిపల్ ఎన్నికల్లో పదో వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్తపాటి సతీష్ ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీపీ తోకల వెంకన్న పదవ వార్డు అభ్యర్థి కొత్తపాటి సతీష్ కి వెన్నంటి ఉండి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ చండూరు మున్సిపాలిటీ పీఠం మీద గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని, 10 వార్డులకు 10 వార్డులు భారీ గెలుపుతో గెలుస్తున్నామని మాజీ ఎంపీపీ తోకల వెంకన్న మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తపాటి సతీష్ కి అండగా ఉంటూ వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ పదో వార్డ్ అభ్యర్థిగా కొత్తపాటి సతీష్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు



