కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి
విశ్వంభర, పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి చంద్రయ్య తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఓటర్లను కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో పరిగి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాయని, పరిగి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రాంచందర్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆనంద్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్, మార్కెట్ కమిటీ శశికళ, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, అంజయ్య, అంతయ్య, బాబు, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.



