హుస్నాబాద్ బస్ స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

  • వర్షాకాలంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
  •  అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ఆ దేశాలు

విశ్వంభర, హుస్నాబాద్ :హుస్నాబాద్ బస్ స్టేషన్‌లో వర్షాకాలంలో ఏర్పడుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి హుస్నాబాద్ బస్ స్టేషన్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్‌లోని ప్రయాణికులతో నేరుగా మాట్లాడిన మంత్రి, బస్సుల రాకపోకలు, మౌలిక సదుపాయాలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల సమయంలో వరద ప్రభావంతో బస్ స్టేషన్‌లో నీరు నిల్వ ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి, వెంటనే తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. బస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న నాలాను ప్రధాన డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానం చేసేలా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీర్లు, ఆర్టీసీ అధికారులకు మంత్రి ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ లేకుండా చేసి ప్రయాణికుల కు మెరుగైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హుస్నాబాద్ ప్రజలు వర్షాకాలంలో బస్ స్టేషన్ సమస్యలపై తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆర్టీసీ ఎండీ, అధికారులతో కలిసి పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. రోజుకు సుమారు 35 వేల మంది ప్రయాణికులు ఈ బస్ స్టేషన్‌ను వినియోగిస్తున్నారని, రెవెన్యూ పరంగా రాష్ట్రంలో ప్రముఖ బస్ స్టేషన్లలో ఇది ఒకటని చెప్పారు. పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ కళాశాలలు, పర్యాటక రంగం, మెడికల్ కళాశాలలు, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధితో హుస్నాబాద్ ప్రాధాన్యం మరింత పెరుగుతోందన్నారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్‌లేన్ రహదారులతో అనుసంధానం కలిగిన హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారాలతో అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి తెలిపారు. ప్రజాధనం వృథా కాకుండా సమర్థవంతమైన ప్రణాళికలతో పనులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ, హుస్నాబాద్ బస్ స్టేషన్‌లో ప్రధాన సమస్య వర్షాకాలంలో నీరు చేరడమేనని అన్నారు. మంత్రి సూచనల మేరకు సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ఖాళీ స్థలాలు, వ్యాపార వర్గాల సహకారం లభిస్తే బస్ స్టేషన్‌ను ఆధునికీకరించి, పెద్ద షాపింగ్ మాల్‌ను తలపించే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రెవెన్యూ పరంగా అత్యధిక ఆదాయం వచ్చే ఏ-క్లాస్ కమర్షియల్ బస్ స్టేషన్లలో హుస్నాబాద్ ఒకటని పేర్కొన్న ఆయన, రోజుకు 35 వేల మందికి పైగా ప్రయాణికులు ఈ కేంద్రాన్ని వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు బస్ స్టేషన్‌ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తామని చెప్పారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-activity-for-development-of-husnabad-bus-station/article-16558

Tags: