వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకి మోడీని గద్దె దించుతాం
- అధిక ధరలపై ఆగ్రహించిన సిపిఐ
- భారీ ర్యాలీ, అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా
విశ్వంభర, మహబూబాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో వందలాదిమంది సిపిఐ శ్రేణులు స్థానిక ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాధర్నా నిర్వహించారు. ఆందోళనలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఏకమై మోడీని గద్దె దించుతాం అన్నారు. 12 ఏళ్ల మోడీ పాలనలో అధిక ధరలకు హద్దు లేదు అన్నారు. దేశంలో సామాన్యుడు ధరాభారాలతో నలిగిపోతున్నాడన్నారు. వంటగ్యాస్ పెట్రోల్ డీజిల్ వంట నూనె పప్పులు ఇలా నిత్యవసర ప్రతి వస్తువుపై ధరలు పెంచి కార్పొరేట్లకే దేశ సంపద దోచిపెడుతున్నాడన్నారు ఒకవైపు నీటి పరీక్ష లీకై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం దానిపై నరేంద్ర మోడీ నోరు మెదపలేదన్నారు వెంటనే సంబంధిత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భర్త రఫ్ చేయాలన్నారు. మోడీ పాలనలో అచ్చేదిన్ కాదని సామాన్యుడు సచ్చేదిన్ అన్నారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం నిరుద్యోగుల నడ్డి విరిచిందన్నారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తూ ఆదాని అంబానీలకే గులాంగిరి చేస్తూ వారి డబ్బుతోనే ప్రతి ఎన్నికల్లో గెలుస్తుంది అన్నారు దేశ సంపద కేవలం ఆదాని అంబానీ జేబులోకే పోతుందని వారికి మాత్రమే ప్రధానిగా మోడీ పని చేస్తున్నాడు అన్నారు. వంటగ్యాస్ ధర 2014లో 500 ఉంటే నేడు వెయ్యి రూపాయలు దాటిందన్నారు ఎన్నికలు కాగానే 60 రూపాయలు నిన్నటికి నిన్న 29 రూపాయలు హిస్టారీతిన పెంచుతున్నాడు అన్నారు. ఒకవైపు కృత్రిమ కొరత సృష్టిస్తూ పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులో లేకుండా మోడీ చూస్తున్నాడని ఇది కేవలం కార్పొరేట్లకే మేలు కలుగుతుందన్నారు. 90 రూపాయల వంటనూనె నేడు 200 రూపాయలుగా పెరిగిందన్నారు. 40 రూపాయల పప్పులు నేడు 160 రూపాయలు పెరిగాయన్నారు. సామాన్యుడు ఎలా బతకాలని విజయ సారధి నిలదీశారు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం అధిక ధరలను నియంత్రించకుంటే మోడీకి వచ్చే ఎన్నికల్లో గద్దె దించడం ఖాయమని జోస్యం చెప్పారు .ఈ ఆందోళనలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బి అజయ్ సారధి, రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, కట్టబోయిన శ్రీనివాస్ ,జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు పెరుగు కుమార్, రె్శపల్లి నవీన్, చింతకుంట్ల, వెంకన్న, మామిళ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగ చారి, వరిపెల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వరరావు, తండ సందీప్, చొప్పరి శేఖర్ ,సారిక శ్రీనివాస్ జంపాల, వెంకన్న, భైస స్వామి బందు ,మహేందర్, నర్రా శ్రావణ్, వెలుగు, శ్రావణ్, ఎండి ఫాతిమా, మేక వీరన్న, కేదాసు రమేష్ అజ్మీరా, వేణు మాలోతు ,రవీందర్, తురక రమేష్, పోలేపాక వెంకన్న, వంకాయలపాటి చిరంజీవి ,ఆబోతు అశోక్ ,కూరాకుల పాల్, తూటి వెంకటరెడ్డి, మాగంలోకేష్, చిర్ర సత్యనారాయ, మంద భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.