ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

  • మొదటి బహుమతిగా  పదివేల రూపాయలు

విశ్వంభర, మాడ్గుల: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మండలంలోని నాగిళ్ల గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కి స్పాన్సర్లుగా సురమళ్ల సుభాష్ మొదటి బహుమతిగా  పదివేల రూపాయలు , రెండవ బహుమతిగా ఆరు వేలరూపాయలు   అందించారు. అదేవిధంగా షీల్డ్స్ అశోక్ గౌడ్, బాల్స్ నాగిళ్ల మహేష్ అందించారు. ఈ పోటీల్లో  ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెడల్స్, మెమంటోలు అందించారు. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ మార్కెట్ డైరెక్టర్ సురమళ్ళ సుభాష్  మాట్లాడుతూ,  క్రీడల తో  మానసిక ఉల్లాసంతో పాటు, శారీరక దృఢత్వం వస్తుందని అన్నారు. కష్టపడితే గ్రామీణ క్రీడాకారులకు కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రస్తుత సమాజంలో నిత్యం ఒత్తిడికి గురై ఇబ్బందులు పడుతున్న సందర్భములో మానసికంగా బలంగా తయారయ్యే అవకాశం ఉందని అన్నారు. యువత చెడుమార్గంలో వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకొని తమ తమ కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు. ఈ  కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ కంచనపల్లి సత్తయ్య, మాజీ మార్కెట్ డైరెక్టర్ సురమళ్ల సుభాష్,వార్డు సభ్యులు బొల్లు కృష్ణ, బండ శ్రీనివాస్, నాయకులు డాక్టర్ వెంకటేశ్, అశోక్ గౌడ్, బందేల జగన్, నాగిళ్ల మహేష్, ప్రవీణ్ రెడ్డి మరియు ఆర్గనైజర్లు రమేష్ యాదవ్, వంశీ, శ్రీధర్, శివ స్టార్, సాయి, కార్తీక్, నెహ్రూ, నవీన్, కార్తీక్ , క్రీడాకారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags: