భూ సమస్యను పరిష్కరించిన ఎంపీడీవో 

భూ సమస్యను పరిష్కరించిన ఎంపీడీవో 

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలందర్ రెడ్డి పహిల్వాన్‌పూర్ గ్రామపంచాయతీని సందర్శించారు.గ్రామంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న భూమి సమస్యను ఎమ్‌పీడీఓ  పరిష్కరించారు. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్న ఆ భూమిని చట్టపరమైన అధికారాలతో తిరిగి స్వాధీనం చేసుకుని, అదే స్థలంలో అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సమస్యను సమర్థంగా పరిష్కరించిన విధానానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Tags: