నిమ్జ్ లో మౌలిక వసతుల కల్పన కు కసరత్తు - సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య
సమీక్ష లో పాల్గొన్న జగ్గారెడ్డి, అడిషనల్ కలెక్టర్ మాధురి, డీఆర్ ఓ పాండు
- ఇప్పటివరకు సేకరించిన భూములను రోడ్లు,ఇతర సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు
- నిమ్జ్ , రెవెన్యూ, సర్వే, టీజిఐఐసి అధికారులతో సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష సమావేశం*
- సమీక్ష లో పాల్గొన్న జగ్గారెడ్డి, అడిషనల్ కలెక్టర్ మాధురి, డీఆర్ ఓ పాండు
విశ్వంభర, సంగారెడ్డి: నిమ్జ్ లో మౌలిక వసతులు కల్పించే ఎస్ఆర్అర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇప్పటివరకు సేకరించిన భూములను అప్పగించాలని కలెక్టర్ సూచించారు. లే అవుట్ అభివృద్ధి చేసేందుకు వీలుగా పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. లే అవుట్ ప్రకారం రోడ్లు, ఇతరత్ర మౌలిక వసతులు కల్పించేందుకు సేకరించిన భూముల్లో హద్దురాళ్ళను ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. గతంలోనే భూములు తీసుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించామని కానీ మొన్నటివరకు ఆ భూముల్లో పనులు చేపట్టకపోవడంతో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఇచ్చామని కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపట్టనుండటం తో ఇకపై పంటలు వేయకుండా చూడాలని, ఐదివరకే పంటలు వేసి ఉంటే కోతలు పూర్తయ్యే వరకు వేచి చూడాలన్నారు. సర్వే ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతియుత వాతావరణం లో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సర్వే సందర్భంగా వేసిన హద్దు రాళ్ళను రైతులేవరూ తొలగించవద్దని, అలా చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్ లు మాధురి, పాండు లతో పాటు టీజిఐఐసి జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి , తాహిల్దార్ లు పాల్గొన్నారు.



