స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన  పోలీస్ సిబ్బంది

స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన  పోలీస్ సిబ్బంది

విశ్వంభర, చంద్రాయణ గుట్ట: పాతబస్తీ చంద్రాయణ గుట్టలోని  స్వయంభు లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ పూజారి కంజర్ల ప్రతాపచార్యులు పర్యవేక్షణలో స్వామివారు, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీగా ఈ సంవత్సరం చంద్రాయన గుట్ట పోలీస్ స్టేషన్ సీఐ రౌతు గోపి,  డిఐ రామస్వామి, ఎస్సైలు, సిబ్బంది కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ గౌడ్,  మాజీ చైర్మన్లు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: