కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ
విశ్వంభర ,నారాయణపూర్
సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని తుంబావి తండా లోని ప్రాథమిక పాఠశాలోని ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి చదివే విద్యార్థుల కోసం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ సహకారంతో విద్యార్థులకు నోట్ బుక్స్ ,మహనీయుల చిత్రపటాలను పంపిణీ చేసిన కస్తూరి ఫౌండేషన్ సభ్యులు, వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థికి అందాలనే లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది అని అన్నారు. విద్యార్థులు శ్రద్దగా చదువుకొని రాబోయే వార్షిక పరీక్షల్లో మంచి గ్రేడ్లు సంపాదించి,వారి తల్లిదండ్రులకు , ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకరావాలని కోరారు. అదే మా కస్తూరి ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు .ఇలాగే ఇంకా మరెన్నో కార్యక్రమాలు కస్తూరిఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు వీరమల్ల కార్తీక్ గౌడ్, కొప్పు రామకృష్ణ, పల్చం శివ, ఎస్ఎంసి చైర్మన్ కేతావత్ బిక్కి, పంచాయతీ కార్యదర్శి వినయ్ , ప్రధానోపాధ్యాయులు రామ్ ఉపాధ్యాయులు ప్రభాకర్ ,తదితరులు పాల్గొన్నారు.